రైల్వే సిగ్నలింగ్​ వ్యవస్థను మెరుగుపరచాలి : ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ

రైల్వే సిగ్నలింగ్​ వ్యవస్థను మెరుగుపరచాలి : ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ
  • ఘనంగా ఇరిసెట్ 67వ వార్షి కోత్సవం

సికింద్రాబాద్, వెలుగు: రైల్వే సిగ్నలింగ్​సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరముందని ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ గంటి అన్నారు. ఇండియన్ రైల్వేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్  టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్) 67వ వార్షికోత్సవ వేడుకలు సికింద్రాబాద్​ మెట్టుగూడలోని సంస్థ ఆవరణలో ఆదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు.

సైన్స్ అండ్​టెక్నాలజీలో వస్తున్న ఆధునిక పద్ధతులను వినియోగించి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలన్నారు. సంస్థ అవసరాలను తీర్చడానికి స్టార్టప్లతో కలిసి పని చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.  ఈ సందర్భంగా ఇరిసెట్​లో శిక్షణ పొందుతూ ప్రతిభ కనబర్చిన పలువురు అధికారులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్​ అరుణ్​కమార్​జైన్, ఇరిసెట్ డైరెక్టర్​జనరల్​శరద్ కుమార్  పాల్గొన్నారు. ఇరిసెట్ సావనీర్​ను ఆవిష్కరించారు.